English | Telugu

పన్వేల్ లోని భూమి ముమ్మాటికి సోనుసూద్ దే.. సేవాగుణంలో నెంబర్ వన్ కదా

సుదీర్ఘ కాలం నుంచి పాన్ ఇండియా యాక్టర్ గా తన సత్తా చాటుతు వస్తున్నాడు 'సోనుసూద్'(Sonu Sood). అంతే స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని కూడా సంపాదించాడు. సేవా గుణంలో కూడా ముందుండే సోనుసూద్ రీసెంట్ గా ముంబై లోని పన్వేల్ లో 777 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసాడు. సదరు ల్యాండ్ విలువ స్టాంప్ డ్యూటీ లతో కలుపుకొని మొత్తం 1 .09 కోట్లుగా తెలుస్తుంది.

పన్వేల్(Panvel)ప్రాంతం ముంబై(Mumbai)నుంచి పూణే(Pune)మార్గంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి బడా కంపెనీలు లేకపొయినా త్వరలోనే ఐటి ప్రాజెక్ట్స్, విద్యాసంస్థలు రాబోతున్నాయంట. అందుకే సోనుసూద్ ప్లాట్ ని కొనుగోలు చేసినట్టుగా టాక్. సోను సూద్ కొన్ని రోజుల క్రితం ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్ ని అమ్మి రెండున్నర కోట్ల రూపాయలని లాభాలు పొందాడు. ఆ తర్వాత తన కుమారుడు పేరుపై ముంబై లోనే ఖరీదైన ప్లాట్ ని కొన్నాడు. ఇలా తక్కువ వ్యవధిలోనే స్థిరచరాస్తులకి సంబంధించి సోనుసూద్ క్రయ, విక్రయాలు చెయ్యడంతో, సంబంధిత వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.

కెరీర్ పరంగా చూసుకుంటే సోను సూద్ ఈ ఏడాది జనవరిలో 'ఫతే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోతో పాటు నిర్మాతగాను వ్యవహరించగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని అందుకుంది.



ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం