English | Telugu

దీపికా పదుకునే కి కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ 

స్టార్ హీరోయిన్ 'దీపికా పదుకునే'(Deepika Padukone)వర్కింగ్ అవర్స్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టిందని, దాని వల్లనే కల్కి పార్ట్ 2(Kalki part 2),స్పిరిట్(Spirit) వంటి చిత్రాలని నుంచి ఆమెని తప్పించారనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీక్రమంగా అందరు మర్చిపోతున్నా కూడా, ఎవరో ఒకరు మళ్ళీ ఈ అంశం గురించి ప్రస్తావనకి తీసుకొస్తూనే ఉన్నారు.

తాజాగా దీపికా పని గంటలపై ప్రముఖ నటి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani)మాట్లాడుతు దీపికా రెండు భారీ ప్రాజెక్ట్స్ నుంచి వైదొలగడమనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత సమస్య. కాకపోతే ఆరిస్టులు ఎప్పుడు నిర్మాతల కోణం నుంచే ఆలోచిస్తూ ఉండాలి. అందుకే నేను ఎప్పుడు నిర్మాతలకి లాభాలు రావాలని అంకిత భావంతో పని చేశాను. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే ఇద్దరు పిల్లలకి తల్లినయ్యాను. ఆ సమయంలో కూడా నా వల్ల నిర్మాతలకి ఇబ్బంది రాకూడదనే షూటింగ్ లో పాల్గొన్నాను. నిర్మాత బాగుండాలని కోరుకోవడం నటిగా నా బాధ్యత అని తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

ఢిల్లీ కి చెందిన స్మృతి ఇరానీ 2000 వ సంవత్సరంలో స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఆతిష్ 'అండ్ హమ్ హైన్ కల్ ఆజ్ ఔర్ కల్' అనే ధారావాహిక తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత బాలాజీ టెలీఫిల్మ్స్ నిర్మించిన 'క్యుంకీ సాస్ బి కభీ బహు థీ' లో 'తులసి విరానీ' అనే క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి, బుల్లితెర ప్రేక్షకులకి అభిమాన నటిగా మారింది. ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూగా ఆ ధారావాహిక ప్రసారం కావడం అప్పట్లో ఒక రికార్డు. ఇప్పుడు 'క్యుంకీ సాస్ బి కభీ బహు థీ' కి సీక్వెల్ వచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారం ప్రసారమవుతుండగా స్మృతి ఇరానీ రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ 'తులసి విరానీ' క్యారక్టర్ లో తన సత్తా చాటుతుంది. ఈ ధారావాహిక కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లోనే పని గంటల విషయం గురించి మాట్లాడింది.1998 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్మృతి మిస్ ఇండియా కిరీటానికి కొంచం దూరంలో నిలిచింది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం