English | Telugu
నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్
Updated : Jun 24, 2011
నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వేళితే ప్రముఖ సినీ ఫైనాన్సియర్, నిర్మాత అయిన సింగనమల రమేష్ నిన్న చెన్నై శివార్లలో సి.ఐ.డి. పోలీసుల చేతిలో అరెస్ట్ చేయబడ్డాడు. సింగనమల రమేష్ ని ముందుగా చెన్నై కోర్టులో హాజరు పరచి ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకు వస్తారని తెలిసింది. ప్రొద్దుటూరుకు చెందిన సింగనమల రమేష్ "ఖలేజా", "కొమరంపులి" వంటి భారి సినిమాలను నిర్మించారు. సింగనమల రమేష్ కు మద్దులచెరువు సూరిని హత్యచేసిన భాను కిరణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయనీ, భాను కిరణ్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో సింగనమల రమేష్ ఆధీనంలోనే ఉన్నాయనీ సి.ఐ.డి.పోలీసుల వాదన.
సింగనమల రమేష్ ను పట్టుకుంటే భానుకిరణ్ ని పట్టుకోవటానికి మార్గం సుగమమవుతుందని వారంటున్నారు. అంతే కాక హైదరాబాద్ లో ఒక సినీ ఫైనాన్సియర్ ని బెదిరించిన కేసులో, భానుకిరణ్ తో పాటు సింగనమల రమేష్ కూడా ఉన్నాడని ఇక్కడ కేసు నమోదయ్యింది. మద్దుల చెరువు సూరి హత్య జరిగిన తర్వాత సుమారు ఒక అయిదు నెలల నుండీ సింగనమల రమేష్ పరారీలో ఉన్నాడు.