English | Telugu

సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ !!

ఓ దశాబ్ధంపాటు తెలుగు, తమిళ వెండితెరలపై వేడి పుట్టించి.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు కాలక్షేపం అందిస్తున్న సిమ్రాన్.. త్వరలోనే సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్‌‍కు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలుగులో "సమరసింహారెడ్డి", "నరసింహనాయుడు", నువ్వు వస్తావని", "కలిసుందాం రా" వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ కలిగిన సిమ్రాన్‌కు.. తమిళంలోనూ అంతే స్థాయిలో హిట్స్ ఉన్నాయి.

కమల్‌హాసన్‌తో కొన్నాళ్లు "సహజీవనం" చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని.. సినిమాలకు "కామా" పెట్టింది. ఆ మధ్య ఒకటీ, అర చిత్రాల్లో నటించినప్పటికీ, అవి సిమ్రాన్ రేంజ్‌కి తగినవి కాకపోవడంతో ఆమె అభిమానులకు రుచించలేదు. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లోని కొన్ని రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సిమ్రాన్.. అతి త్వరలో ఓ లేడి ఓరియంటెడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పరిశ్రమ వర్గాలకు సంకేతాలు పంపిన సిమ్రాన్.. తన రూప లావణ్యాలకు సైతం మునుపటి వైభవం అద్దేందుకు అవసరమైన చర్యలు (వ్యాయామాలు, యోగా వంటివి) చేపట్టిందని తెలుస్తోంది. మరి సిమ్రాన్ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.