Read more!

English | Telugu

సిద్ధార్థ 180 ఆడియో ఏప్రెల్ 21 న

సిద్ధార్థ "180" ఆడియో ఏప్రెల్ 21 వ తేదీన విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, యాడ్ ఫిల్మ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో, సత్యం సినిమాస్, అఘళ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"180".

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సిద్ధార్థ "180" చిత్రం ఆడియో ఏప్రెల్ 21 వ తేదీన రిలీజ్ చేయనున్నారట. నిజానికి సిద్ధార్థ "180" చిత్రం ఆడియో "మే" నెల ఏడవ తేదీన రిలీజ్ చేస్తారని ముందుగా అందిన సమాచారం. ఈ సిద్ధార్థ "180" తమిళ వెర్షన్ చిత్రం ఆడియో ఇప్పటికే తమిళనాడులో రిలీజయ్యింది.

 

ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే గతం గడచిపోయింది గనక దాంతో పనిలేదనీ, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు గనక దాంతోనూ పనిలేదనీ, వర్తమానం ఒక్కటే మన చేతిలో ఉంటుంది గనక వర్తమానంలోనే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలనుకునే యువకుడి కథే ఈ సిద్ధార్థ "180" చిత్రమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం. "బొమ్మరిల్లు" చిత్రం తర్వాత హీరో సిద్ధార్థకు ఆ రేంజ్ హిట్ ఇంతవరకూ రాలేదు. ఈ సిద్ధార్థ "180" చిత్రం హిట్టవుతుందని అతనెంతో నమ్మకంతో ఉన్నాడు.