English | Telugu

టాలీవుడ్ అందగాడెవరు

టాలీవుడ్ అందగాడెవరు అనే చర్చ ఈ మధ్య ఫిలిం నగర్ వర్గాల్లో జరిగింది. దీనికి సమాధానంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరో పేరు చెపుతూ ఆ హీరోనే ఎందుకు టాలీవుడ్ అందగాడో విశ్లేషించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మన టాలీవుడ్ లో చాలా మమది హీరోల ప్రస్తావన వచ్చింది. వారిలో ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యువ హీరో రానాల పేర్లు బలంగా వినపడ్డాయి.

ఈ ముగ్గురు హీరోలూ ఆరడుగులకు మించిన ఎత్తు కలిగిన వారు. ప్రిన్స్ మహేష్ బాబు ఆరడుగుల రెండంగుళాల ఎత్తయితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా దాదాపు అదే ఎత్తు కలిగి ఉన్నాడు. కాని యువ హీరో రానా అయితే ఏకంగా ఆరడుగుల నాలుగంగుళాల ఎత్తున్నాడు. దాదాపు మన తెలుగు సినీ పరిశ్రమలో ఇంతెత్తున్న హీరో ఇంతవరకూ మరొకరు లేరని అంటే అది అతిశయోక్తి కాదు.

ఇక వీరి ప్రతిభ గురించీ, వీరి గ్లామర్ గురించీ, వీరి సక్సస్ రేట్ గురించీ ఆలోచిస్తే ప్రస్తుతానికి సీనియర్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు మాత్రమే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. అలాగని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం తక్కువ వాడేం కాదు.ఇక యువ హీరో తానేంటో ఇకపైనే నిరూపించుకోవాల్సి ఉంది. కారణం అతను హీరోగా నటించిన "లీదర్"ఒక్క చిత్రమే ఇప్పటి వరకూ విడుదలయ్యింది. అతని రెండవ చిత్రం "నేను- నా రాక్షసి"విడుదలకు సిద్ధంగా ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.