English | Telugu

కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని

కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని హీరోగా ఒక చిత్రంలో నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో, యువ హీరో నాని హీరోగా నటించబోతున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో "ఈగ" అనే చిత్రంలో నాని హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే నాని కృష్ణ వంశీ దర్శకత్వంలోని సినిమాలో నటించనున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా, తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న "మొగుడు" చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "మొగుడు" చిత్రం పూర్తికాగానే నాని హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. గతంలో మహేష్ బాబుకి "మురారి" వంటి తొలి సూపర్ హిట్టిచ్చిన దర్శకుడు కృష్ణ వంశీ, జూనియర్ యన్ టి ఆర్ కి "రాఖీ" వంటి హిట్టిచ్చారు. రవితేజకి "ఖడ్గం", ప్రభాస్ తో "చక్రం" వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ వంశీ యువ హీరో నానికి ఎటువంటి హిట్టిస్తారో వేచి చూడాలి. నాని గతంలో "అష్టాచమ్మా" ఇటీవల "అలా మొదలైంది"వంటి హిట్ చిత్రాలతో సక్సస్ లో ఉన్నారు. కృష్ణ వంశీ, నానిల కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం ఎంత విభిన్నంగా ఉంటుంది వేచి చూడాలి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.