English | Telugu

ప్రేమ లేదు... పెళ్లి లేదు..!

"గబ్బర్ సింగ్" చిత్రం తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్యూటీ శృతిహాసన్. ఈ అమ్మడు ప్రేమలో పడిందని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు విని విని విసుగెత్తిపోయిన శృతి ఓ ఇంటర్వ్యూ లో ఈ పుకార్లను ఖండించింది. తాను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రేమలో పడలేదని, తాను రాసుకున్న డైరీ చూసినవారు నాతో ప్రేమలో పడరు, పెళ్లి చేసుకోరు అని చెప్పింది. అలాగే ప్రస్తుతం తన లైఫ్ లో కెరీర్ కు మాత్రమే ప్రాధాన్యం అని.. ప్రేమకి, పెళ్లికి ప్రాధాన్యం ఇవ్వదల్చుకోలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ అమ్మడు ప్రేమ సంగతి ఎప్పుడు చెబుతుందో, అసలు ఆ డైరీలో ఏం రాసుకుందో అని అందరూ అనుకుంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.