English | Telugu
పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ నేర్పిన గురువు కన్నుమూత..ఇదే ప్రధాన కారణం
Updated : Mar 25, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి కరాటే,కిక్ బాక్సింగ్ వంటి పలు మార్షల్ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే.తన మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో పాటు తమ్ముడి మూవీలోను వాటిని స్క్రీన్ పై ప్రదర్శించి అభిమానులు,ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు.
పవన్ కి వీటిని నేర్పించిన గురువు పేరు షిహాన్ హుసైని(Shihan Hussaini)చెన్నైకి చెందిన షిహాన్ భారతీయ కరాటే నిపుణుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు.అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఉదయం చెన్నై లో చనిపోయారు.60 సంవత్సరాల వయసు గల షిహాన్ కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఉంచి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు.చివరికి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడవడంతో ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేసారు.
1986 లో బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్(kamal Haasan)రేవతి(Revathi)జంటగా వచ్చిన'పున్నగై మన్నన్. అనే చిత్రం ద్వారా నటుడుగా కూడా పరిచయమైన షిహాన్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు.కరాటే నే కాకుండా ఆర్చరీ రంగంలోను విశేష నైపుణ్యం ఉన్న షిహాన్ ఆ రంగంలో కూడా ఎంతో మందిని తయారు చేసాడు.