English | Telugu

నాని నిత్యమీనన్ ల సెగ రిలీజ్ డేట్ జూలై 15

నాని నిత్యమీనన్ ల "సెగ" రిలీజ్ డేట్ జూలై 15 అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే నాని, నిత్య మీనన్ జంటగా, బిందు మాధవి ముఖ్య పాత్రలో నటిస్తూండగా, అంజనా దర్శకత్వంలో, గౌతమ్ మీనన్ తమిళంలో,అశోక్ వల్లభనేని తెలుగులో నిర్మించిన ద్విభాషా చిత్రం "సెగ". తమిళంలో ఈ చిత్రం పేరు "వెప్పం". గతంలో తెలుగులో నందినీ రేడ్డి దర్శకత్వంలో, శ్రీ రమజిత్ మూవీస్ పతాకంపై, కానూరి దామోదర ప్రసాద్ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం "అలా మొదలైంది" చిత్ర్రంలో నాని హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా నటించారు.

ఆ చిత్రం తర్వాత నాని, నిత్య మీనన్ కలసి మళ్ళీ నటిస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. నందినీ రెడ్డికి అంజనా మంచి స్నేహితురాలు. అంజనా కరేటేలో బ్లాక్ బెల్ట్ డిగ్రీ హోల్డర్ కావటం విశేషం కాగా నందినీ రెఅడ్డి, అంజనా ఇద్దరూ కూడా లేడీ డైరెక్టర్లే కావటం మరో విశేషం. ఈ "సెగ" చిత్రం జూలై 15 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే జూలై 15 వ తేదీన రిలీజ్ కానుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.