English | Telugu

టాలీవుడ్ లో "బి" కంపెనీ మాఫియా

టాలీవుడ్ లో "బి" కంపెనీ మాఫియాఉందని అందరూ అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా "ఖలేజా", పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "కొమరంపులి" వంటి భారీ చిత్రాలను నిర్మించిన సినీ ఫైనాన్సియర్, సినీ నిర్మాత సింగనమల రమేష్ ను ఈ మధ్య సి.ఐ.డి.పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సింగనమల రమేష్ కు ప్రముఖ గ్యాంగ్ స్టర్, ఇటీవల తన ముఖ్య అనుచరుడి చేతిలోనే హత్యకు గురికాబడ్డ మద్దులచెరువు సూరికి మధ్య మంచి అనుబంధం ఉండేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూరి అప్పట్లో దాదాపు 10 శాతం సినిమాలకు అంటే "రక్తచరిత్ర, ఖలేజా, కొమరమపులి" వంటి పలు సినిమాలతో సహా సింగనమల రమేష్ ద్వారానే ఫైనాన్స్ చేశాడనీ, ఆ తర్వాత సూరీ హత్యకు గురి కావటతో, అతని స్థానాన్ని సూరీని చంపిన భానుకిరణ్ భర్తీ చేశాడనీ ఫిలింనగర్ లోనూ, పోలీసులూ అనుకుంటున్నారట. సురీ, భానుకిరణ్ ల అండ చూసుకుని సింగనమల రమేష్ సినిమాల్లో తనకు ఫైనాన్స్ ఇచ్చిన వారిని బెదిరించటమే కాకుండా, రియల్ ఎస్టేట్ దందాల్లో కూడా తన హవా కొనసాగించాడనీ, పలువురిని బెదిరించి స్థలాలను కబ్జా చేసే వాడనీ కూడా సింగనమల రమేష్ మీద పలు ఆరోపణలున్నాయి.

నిర్మాతల మండలి సెక్రెటరీ టి.ప్రసన్నకుమార్ మాటల ప్రకారం సింగనమల రమేష్, మరో నిర్మాత సి.కళ్యాణ్ తో కలసి ఈ సినీ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడనీ, వీళ్ళిద్దరికీ ఈ విషయమై మంచి అనుబంధం ఉండేదనీ తెలిసింది. ముంబాయిలో "డి"గ్రూప్ అంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ లాగా ప్రస్తుతం టాలీవుడ్ లో "బి"గ్రూప్ అంటే భాను కిరణ్ గ్రూప్ రాజుమేలుతోందా అని పలువురు సినీ ప్రముఖులు అనుకుంటున్నారు.