English | Telugu

సత్యభామ గా కాజల్ నట విశ్వరూపం షురు

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో కాజల్ మొట్టమొదటి సారిగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. తాజాగా దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని మేకర్స్ సత్యభామ టీజర్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ టీజర్ తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ చేస్తుంది.

చావు బతుకుల్లో ఉన్న ఒక అమ్మాయి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన సత్య భామ చేతుల్లో చనిపోతుంది. దాంతో సత్య భామ ఆ అమ్మాయిని బతికించలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ తో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. పై అధికారులు సత్య భామ తో చనిపోయిన అమ్మాయి కేసు నీ చేతుల్లో లేదు కదా అని అంటారు. అప్పుడు సత్యభామ అధికారులతో ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది అని ఆ యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది. పురాణాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన కృష్ణుడి భార్య సత్యభామ సాహసంతో ఈ సత్యభామ సాహసాన్ని పోల్చుతూ ఆనాటి పురాణాల్లో వర్ణించిన పాట ఒకటి బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ గా రావటం చాలా బాగుంది. టీజర్ ఆసాంతం కాజల్ తన నటనతో ఆకట్టుకుంది. చివర్లలో ఎవరో ఒక లేడీ అచేతన స్థితిలో పడిపోయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి పేస్ ని రివీల్ చెయ్యరు. ఆ అమ్మాయి చేతి మీద ఐ డోంట్ కేర్ అని రాసి ఉంటుంది. చివర్లో ఆ అమ్మాయి కదిలింది అన్నట్టుగా చూపించి టీజర్ ని ఎండ్ చెయ్యడం బాగుంది.

కాజల్ నట విశ్వరూపం చూడటం పక్కా అనే విషయం టీజర్ ని చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్ధం అయ్యింది.ఈ సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే ని అందించడమే కాకూండా చిత్ర సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ సత్యభామ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.