Read more!

English | Telugu

సర్దార్ డైలాగ్ డబ్ స్మాష్ చేసిన హీరోయిన్..!

ఓయ్...! పేరు గుర్తుందిగా..గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్. ఇదీ ట్రైలర్ ఎండింగ్ లో పవన్ చెప్పిన డైలాగ్. బాండ్ జేమ్స్ బాండ్ రేంజ్ లో పవన్ ఈ డైలాగ్ చెప్పాడు. ఆల్రెడీ పవన్ అభిమానులకు ఈ డైలాగ్ ఫేవరెట్. లేటెస్ట్ గా తన డబ్ స్మాష్ తో సర్దార్ గబ్బర్ సింగ్ పవర్ ఫుల్ డైలాగ్ కు అందాన్ని తీసుకొచ్చింది నిషా అగర్వాల్. పవర్ స్టార్ సినిమా గురించి అందరికన్నా ఎక్కువగా ఎదురుచూస్తున్నానంటూ నిషా చెప్తోంది. సర్దార్ లో హీరోయిన్ గా చేసిన తన అక్క కాజల్ కు ఈ డబ్ స్మాష్ డెడికేట్ చేస్తున్నానని తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో నిషా పోస్ట్ చేసింది. ఇప్పుడు సినీ జనాల్లో సర్దార్ మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా పవన్ సినిమా గురించే చర్చ. సినిమాకు టిక్కెట్లు దొరికాయా అని ఒకరు, ఎలా ఉంటుందో అని మరొకరు ఇలా ఎటుచూసినా సర్దార్ మోత మోగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఒకేలా ఎదురుచూస్తున్న సర్దార్ ఏప్రిల్ 8 న సస్పెన్స్ కు తెరదించుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, రిలీజయ్యే ప్రతీచోట సర్దార్ టిక్కెట్స్ సేల్ అవుట్ అయిపోయాయి. వీకెండ్ ముగిసేసరికే, చాలా రికార్డుల్లో సర్దార్ బాహుబలిని దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ కలెక్షన్ రికార్డును దాటలేకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సర్దార్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.