Read more!

English | Telugu

విలన్ జగపతిబాబు సక్సెస్ సీక్రెట్ ఇదే..!

ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఒక ఊపు ఊపి..శోభ‌న్ బాబు త‌ర్వాత అంత‌టి రేంజ్ అందుకున్నాడు. హీరోగా అవ‌కాశాలు స‌న్న‌గిల్ల‌డంతో విల‌న్ క‌మ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ అయ్యాడు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో లాంటి చిత్రాలు జ‌గ‌ప‌తికి క్రేజ్ తీసుకువ‌చ్చాయి. దీంతో తెలుగుతో పాటు ద‌క్షిణాది బాషల‌న్నింటిలో బిజి అయ్యారు. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కొత్త సినిమాతో పాటు తమిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ సినిమాల్లో విల‌న్ గా ఎంపిక‌య్యారు జ‌గ‌ప‌తి. సౌత్ లో చాలా మంది విల‌న్లు ఉండ‌గా జ‌గ‌ప‌తి బాబునే అన్ని ఇండ‌స్ట్రీలు ఎందుకు విల‌న్ గా ప్రిఫ‌ర్ చేస్తున్నాయంటే అందుకు స‌మాధానం ఒక్క‌టే. ఆయ‌న మ్యాన్లీ లుక్, బాడీ లాంగ్వేజ్.

ఒక‌ప్పుడు విల‌న్లంటే కోర మీసాలు, మెడ‌లో రిబ్బ‌న్, బెల్టులో క‌త్తి పెట్టుకుని తిరిగేవారు. మారుతున్న ట్రెండ్, ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు హీరోకి పోటి ఇచ్చే రేంజ్ లో విల‌న్లు ఉండాల‌ని ఆడియన్స్ కోరుకుంటున్నారు. దీన్ని ప‌సిగ‌ట్టిన జ‌గ‌ప‌తి బాబు హీరోల‌కి ఈక్వ‌ల్ గా ట్రెండీ లుక్ లో విల‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌డంతో అభిమానులు బాగా రీసీవ్ చేసుకున్నారు. ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా జ‌గ‌ప‌తిబాబే త‌మ సినిమాల్లో విల‌న్ గా కావాల‌ని కోరుకుంటున్నార‌ట‌.