Read more!

English | Telugu

బట్టలిప్పి పరిగెడతానంటూ పవన్ కళ్యాణ్ పై ఛాలెంజ్..!

సర్దార్ గబ్బర్ సింగ్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు కమాల్ ఖాన్. బాలీవుడ్ లో రివ్యూలు ఇస్తూ సైడ్ లైన్ లో ఉండే ఇతగాడు పవన్ మీద విమర్శలు చేస్తూ, నెగటివ్ పబ్లిసిటీ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. జనరల్ గా ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ కోరుకునే వారిలో అగ్రస్థానంలో ఉండే వర్మ తోనే కమాల్ ఖాన్ ఛాలెంజ్ చేశాడు. మొదట వర్మ చేసిన ట్వీట్ తో ఇది మొదలైంది. బాహుబలి రిలీజ్ రోజున కిలోమీటర్ కు పైనే లైన్ కనిపించింది. మరి సర్దార్ కు అంతకు మించి లైన్ ఉంటుందా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. కనీసం 0 కిలోమీటర్లు కూడా ఉండదు అంటూ కమాల్ రిప్లై ఇచ్చాడు.

పవన్ సినిమా హాల్లో పదిమందికంటే ఎక్కువ ఉంటే, తాను ఆంధ్రా తెలంగాణాలో బట్టలు విప్పేసి రెండు రాత్రుళ్లు రెండు పగళ్లు పరిగెడతానంటూ కమాల్ ఖాన్ ఛాలెంజ్ చేశాడు. మరి వర్మ గారు తక్కువ తిన్నారా. బట్టలిప్పి పరిగెత్తడానికి సిద్ధంగా ఉండు అంటూ కమాల్ కు ఫైనల్ గా వార్నింగ్ ఇచ్చేశారు. వర్మ, కమాల్ లు ఇద్దరూ ఒకేరకం. తిట్లు తినైనా సరే లైమ్ లైట్ లో ఉండాలని అనుకుంటారు. కానీ వర్మకు కనీసం టాలెంట్ అయినా ఉంది. కమాల్ కు ఏమీ లేదు. పవన్ ఫ్యాన్స్ మాత్రం కమాల్ లాంటి వాడి మాటలు మేం కనీసం పట్టించుకోం అంటున్నారు. సర్దార్ రిలీజైన తర్వాత కమాల్ తన మాట మీద నిలబడతాడో లేదో చూడాలి..