English | Telugu
అబ్బబ్బ.. అదిరిపోయావు సమంతా!
Updated : Jun 30, 2014
అసలే సమంత అందం సూపరు. హిట్టుమీద హిట్టు కొడుతున్న సమంతలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. మామూలుగానే అదిరిపోయే అందగత్తె.. దానికి తోడు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఇంకేం.. సమంతని చూడ్డానికి రెండు కళ్ళూ చాలడం లేదు. బంపర్ హిట్ ‘మనం’ తర్వాత సమంత గ్లామర్ డబుల్ అయిందన్న అభిప్రాయాన్ని రాష్ట్రంలో కుర్రోళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమంత ఆదివారం జరిగిన ‘అల్లుడు శీను’ ఆడియో ఫంక్షన్‌కి అదిరిపోయే డ్రస్ వేసుకొచ్చింది. ఆ డ్రస్‌ని ధోతీ టైప్ శారీ అంటారట. ఆ అదిరిపోయే డ్రస్‌లో సమంతని చూసిన వాళ్ళ అధరాలన్నీ అదరిపోయాయి. చాలామంది తమ మనసులలో ‘అదిరేటి డ్రస్సు నువ్వేస్తే.. దడ’ అని పాటలు కూడా పాడుకున్నారు. కింద నుంచి పై వరకు వెండి రంగులో మెరిసిపోతూ వున్న సమంతని చూసిన కొంతమంది భావుకత్వం వున్న కుర్రాళ్ళు ‘వెండి మధ్యలో వజ్రం వుంది’ అని తన్మయత్వంతో అనుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వెరైటీ చీరలో నువ్వు అదిరిపోయావు సమంతా!