English | Telugu

సమంత ఏం చెప్పబోతోంది....పోస్ట్ కి మీనింగ్ ఏమిటి?

సమంత ఇన్స్టా స్టోరీ పోస్ట్ ఇప్పుడు సోషల్ వైరల్ అవుతోంది. ఇంతకు ఆమె ఎం పోస్ట్ పెడుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సంథింగ్ స్పెషల్ రాబోతోంది..స్టే స్ట్యూన్డ్ అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతోపాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలు పీక్స్ కి వెళ్లాయి. అంటే తన కొత్త సినిమా గురించి చెబుతుందని కొందరు , తన పర్సనల్ లైఫ్ ఎవరితోనో మింగిల్ అవుతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో గుడ్ న్యూస్ ఏమన్నా చెప్పబోతోందా...ఎవరినైనా తన లైఫ్ లోకి ఆహ్వానిస్తోంది,

లేదా మయోసిటిస్ జబ్బు పూర్తిగా తగ్గిపోయిందని చెప్తుందా.. లేదంటే ఏదన్న కొత్తగా బిజినెస్ లాంటివి అనౌన్స్ చేయబోతోంది అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత కూడా నాగచైతన్యలా ఎంగేజ్మెంట్ చేసుకోబోతోందా ? లేదా విమెన్ అవెర్నెస్ కి సంబంధించి ఎమన్నా చేయబోతోందా..ఇలాంటివి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఐతే సమంత ఫాన్స్ మాత్రం తన కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్పబోతోంది అంటున్నారు. కానీ మూవీ అప్డేట్ సమంత చెప్పేదేముంటుంది..ఆ మూవీ మేకర్స్ చెప్తారు కదా అని ఇంకొంతమంది ఫాన్స్ కూడా అంటున్నారు. ఇంతకు సమంత చెప్పే ఆ న్యూస్ ఏంటో తెలియాలి అంటే కొంత టైం వెయిట్ చేయక తప్పదు. ఈ ఊహాగానాల్లో ఏదైనా నిజం కావొచ్చు, కాకపోనూవచ్చు..చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.