English | Telugu
అబ్బాయిల్లో... సమంత ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Updated : Jun 24, 2023
సమంత రూత్ ప్రభు... ఇప్పుడు ఇది ఒక పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. సోషల్ మీడియాలో ఉన్నదున్నట్టు మాట్లాడగలిగే నైజం ఉన్న సెలబ్రిటీ. రియల్ అండ్ రా బ్యూటీగా పేరుంది సమంతకి. తన జీవితంలో జరిగే మంచీ చెడులను ధైర్యంగా అభిమానుల ముందు ఉంచగలిగే స్టార్ ఆమె. ఇవాళ ఆమె తన జీవితంలో చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులోనూ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చారు. అబ్బాయిల్లో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. ఆమె దృష్టిలో అతను ఫ్రెండ్, యాక్టర్, డైరక్టర్ మాత్రమే కాదు, చాలా మంచి వ్యక్తి. దయ గల వ్యక్తి కూడా. రాహుల్ రవీంద్రన్ డెలీషియస్ ఫుడ్ ఫొటోలను షేర్ చేశారు సమంత. అతని మీద జీవిత కాలం అభిమానం చూపిస్తానని అన్నారు సమంత. అంతే కాదు, తన జీవితంలో అతను చేసిన సపోర్ట్ గురించి మాట్లాడారు. ``మీకు బాగా తెలిసిన వ్యక్తిని తీసుకోండి. దాన్ని వందతో గుణించండి. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఐ లవ్యూ రాహుల్ ఫరెవర్ అండ్ ఎవర్`` అని పోస్ట్ చేశారు. అంతే కాదు, అతను స్వతహాగా భోజన ప్రియుడైనప్పటికీ తనకు కంపెనీ ఇవ్వడానికి తక్కువ తింటాడనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
సమంత కష్టసుఖాల్లో తోడున్న బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. ఆమెను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తుంటారు. గాఢమైన శ్వాస తీసుకో. అంతా సర్దుకుంటుంది. ఈ ఏడెనిమిది నెలల్లో ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలను అనుభవించావు. వాటి నుంచి బయటకు వచ్చావు. వాటిని ఎలా ఎదుర్కొన్నావో గుర్తుచేసుకో అంటూ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. సమంత మాత్రమే కాదు, రాహుల్ కూడా ఆమెకున్న మయోసైటిస్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఆమెను విమెన్ ఆఫ్ స్టీల్ అని ప్రశంసించారు రాహుల్. వీరిద్దరూ కలిసి మాస్కోవిన్ కావేరిలో నటించారు. అప్పటి నుంచీ వీరిమధ్య స్నేహం కొనసాగుతోంది. రాహుల్ భార్య చిన్మయితోనూ మంచి స్నేహం ఉంది సమంతకు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి, వరుణ్ ధావన్‌తో సిటాడెల్‌లో నటిస్తున్నారు.