English | Telugu

నేడు సమంత పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు 


-నేడు సమంత పెళ్లి!
-ఈ న్యూస్ నిజమేనా!
-వరుడు ఎవరో తెలుసా
-శ్యామలీ చేసిన పోస్ట్ లో ఏముంది!


సమంత(Samantha)సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. షార్ట్ టైంలోనే అగ్ర హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. సమంత కోసమే సినిమాకి వెళ్లేంత అభిమాన గణం కూడా తన సొంతం.ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడమోరు'(Raj Nidamoru)తో సమంత రిలేషన్ లో ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ఆ ఇద్దరు కలిసి పలు ప్రదేశాల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.


రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత, రాజ్ ఈ రోజు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ఒక రేంజ్ లోనే వినిపిస్తున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న 'ఈశా యోగా సెంటర్' లో సదరు వివాహం జరుగుతున్నట్టుగా కూడా టాక్. ఈ విషయానికి బలాన్ని చేకూర్చేలా రాజ్ మొదటి భార్య శ్యామలీ రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో 'తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అనే వ్యాఖ్యని జోడించింది. సమంత, రాజ్ పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ శ్యామలీ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.


also read: శోభన్ బాబు దారిలోనే పవన్ కళ్యాణ్


రాజ్ దర్శకత్వంలో సమంత మొదట 'ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో చేసింది. 2021 లో స్ట్రీమింగ్ కి రాగా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజ్ దర్సకత్వంలోనే వచ్చిన 'సిటాడెల్ హనీ బన్నీ' అనే మరో వెబ్ సిరీస్ లో కూడా చేసింది, మరి ఆ ఇద్దరి పెళ్లి వార్త ఎంత నిజమో ఆ ఇద్దరే చెప్పాల్సి ఉంది.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం