English | Telugu

స‌మంత ట్రైల‌ర్ విడుద‌ల‌య్యేది అప్పుడే!

స‌మంత అభిమానులు మంగ‌ళ‌వారం త‌ల్ల‌డిల్లిపోయారు. షూటింగ్ లో స‌మంత చేతికి గాయాల‌వ్వ‌డంతో, గెట్ వెల్ సూన్ అంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. మ‌రికొంద‌రైతే, అస‌లే అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు, ఇంత త్వ‌ర‌గా ఎందుకు షూటింగులకు వెళ్లావు, నీ క‌మిట్‌మెంట్ చూస్తుంటే పొగ‌డాలో, విసుక్కోవాలో అర్థం కావ‌డం లేదు అని అంటున్నారు. స‌మంత షూటింగ్‌లో గాయ‌ప‌డ్డార‌నే వార్త క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. అయితే అదే రోజు సాయంత్రం ఆమె అభిమానుల‌ను మ‌రో వార్త ఊరించింది. అది సిటాడెల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ విష‌యం. అయితే ఈ సిటాడెల్ స‌మంత‌కు సంబంధించిన‌ది కాదు.

ప్రియాంక చోప్రాకు సంబంధించిన సిటాడెల్ న్యూస్‌. హాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న సీరీస్ సిటాడెల్‌. ఈ వెబ్‌సీరీస్ ప్రైమ్ ట్రైల‌ర్‌ని బుధ‌వారం విడుద‌ల చేస్తారు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే థ్రిల్ల‌ర్ త‌ర‌హా స‌బ్జెక్టుతో తెర‌కెక్కిస్తున్నారు. అక్క‌డ ప్రియాంక చోప్రా కీ రోల్ చేస్తున్నారు. గ‌త కొన్ని యుగాలుగా ఈ ట్రైల‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్ప‌టికి విడుద‌ల చేస్తున్నార‌ని తెలిసి ఆనందంగా ఉంది అని కామెంట్ చేశారు ఓ నెటిజ‌న్‌. ఇంకా వెయిట్ చేయ‌డానికి ఓపిక లేదు క్వీన్ అని అన్నారు మ‌రో నెటిజ‌న్‌. ట్రైల‌ర్ చూసి ఎలా ఉందో చెప్ప‌మ‌ని ఊరిస్తున్నారు నిక్ జోనాస్‌. ఏప్రిల్ 28నుంచి ఈ సీరీస్‌ని ప్ర‌సారం చేస్తామ‌ని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త ఎపిసోడ్‌ని ప్ర‌సారం చేస్తారు. మే 26 వ‌ర‌కు ఈ ప్ర‌సారాలు సాగుతాయి.

ప్రియాంక చోప్రాతో రిచ‌ర్డ్ మ్యాడ‌న్ న‌టిస్తున్న సీరీస్ ఇది. మ‌న ద‌గ్గ‌ర ఇదే సీరీస్‌లో స‌మంత న‌టిస్తున్నారు. ఆమెతో పాటు వ‌రుణ్‌ధావ‌న్ కీ రోల్ చేస్తున్నారు. త‌న అభిమాన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేస్తున్నారు స‌మంత‌. స‌మంత సిటాడెల్ ట్రైల‌ర్ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని టాక్‌. షూటింగులో గాయ‌ప‌డ్డ‌ప్ప‌టికీ, కాసేపు రెస్ట్ తీసుకుని వెంట‌నే మ‌ళ్లీ స్పాట్‌లోకి వెళ్లార‌ట స‌మంత‌. ఆమె డెడికేష‌న్ చూసి మురిసిపోతున్నారు మేక‌ర్స్.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.