English | Telugu

సల్మాన్‌ 'కిక్' పోస్టర్ అదిరిపోయింది

తెలుగు రీమేక్ హిందీలో అదే పేరుతో రూపొందిన సంగతి తెలిసిందే. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధం అయ్యింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం జైహో పరాజయం పాలవడంతో ఈ సినిమాపై మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు సల్మాన్.

ధూమ్-3, క్రిష్ చిత్రాలను తలదన్నేలా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో కలెక్షన్ల కింగ్ గా మారిన సల్మాన్ ఖాన్ కిక్ ప్రమోషన్ లో భాగంగా అనేక టీవీషోల్లో పాల్గోంటున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేశారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.