English | Telugu

బాబు.. సిక్స్ ప్యాక్ చేస్తాడ‌ట‌!

రౌడీ ఫెలో చూసిన త‌ర‌వాత అంద‌రిదీ ఒకే మాట‌. నారా రోహిత్ మ‌రీ ఇంత‌ బొద్దుగా ఉన్నాడేంటి...?? అనుకొన్నారు. మ‌రీ ఇంత లావైతే... భ‌విష్య‌త్తు చాలా కష్టం అనే కామెంట్లూ చేశారు. ఇవి కాస్త నారా రోహిత్ చెవిలోనూ ప‌డ్డాయ‌ట‌. అందుకే... అర్జెంటుగా స్లిమ్ అయిపోవాల‌నే నిర్ణ‌యానికొచ్చాడు. అంతేకాదు..ప‌నిలో ప‌నిగా సిక్స్ ప్యాకూ చేస్తాడ‌ట‌. బాగాలావ‌య్యా అనే మాట‌లు వినిపించాయి... అందుకే బాగా స‌న్న‌బ‌డాల‌ని నిర్ణ‌యించుకొన్నా, అందుకు సంబంధించి క‌స‌ర‌త్తులు కూడా మొద‌లెట్టేశా.. అంటున్నాడు నారా రోహిత్‌. త్వ‌ర‌లోనే కొత్త రోహిత్‌ని చూస్తార‌ని మాటిచ్చేశాడు. రోహిత్ త‌న సొంత బ్యాన‌ర్లో మూడు చిత్రాలు చేయ‌బోతున్నాడు. అందులో ఒక‌దాంట్లో నారా రోహితే హీరో. ఆ సినిమాలో రోహిత్ సిక్స్ ప్యాక్ తో క‌నిపిస్తాడ‌ట‌. మొత్తానికి రోహిత్‌.. త‌న మైన‌స్సుని బాగానే ప‌సిగ‌ట్టాడు. సిక్స్ ప్యాక్‌లు చేసిన బాబుల్లో... రోహిత్ పేరు కూడా చేరిపోతుంద‌న్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.