English | Telugu
పరువు పోగొట్టుకున్న రోజా.. సొంత పార్టీ వాళ్ళే తిడుతున్నారు!
Updated : Sep 24, 2024
ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తిరుమల ప్రసాదాన్ని కలుషితం చేయడంలో పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతోందని వై.ఎస్.జగన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దానికి కారణమైన ఎ.ఆర్. డైరీకి షోకాజ్ నోటీసులు కూడా పంపించింది. త్వరలోనే దోషులు ఎవరు అనేది బట్టబయటు కానుంది.
ఇదిలా ఉంటే.. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆర్.కె.రోజా తిరుమల లడ్డు విషయంలో చూపించిన అత్యుత్సాహం వైసీపీ, రోజాల చెంప ఛెళ్ళుమనిపించింది. తిరుమల లడ్డు కల్తీలో తప్పెవరిది అంటూ వై.ఎస్.జగన్, నారా చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ పేర్లను ప్రస్తావిస్తూ ఓ పోల్‌ను నిర్వహించింది. దీనిలో వై.ఎస్.జగన్‌కి 73 శాతం, చంద్రబాబునాయుడుకి 20 శాతం, పవన్‌కళ్యాణ్‌కి 7 శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్నిబట్టి లడ్డు కల్తీలో పూర్తి పాపం జగన్‌దేనని ప్రజలు నిర్ణయించారు. చంద్రబాబునాయుడుకి, పవన్‌కళ్యాణ్‌కి వచ్చిన ఆ కొద్ది శాతం ఓట్లు కూడా వారి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు, వ్యక్తిగతంగా వారిని ద్వేషించే వారు అన్య మతస్తులు వేసి ఉంటారు తప్ప లడ్డు విషయంలో మాత్రం కాదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో తెలివిగా పోల్ పెట్టాను అని ఫీలైన రోజా చెంప ఛెళ్లుమనిపించారు ప్రజలు. రోజా పెట్టిన పోల్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ట్రోలింగ్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే బిక్కసచ్చి ఉన్న వైసీపీకి తను పెట్టిన పోల్ ద్వారా మరింత అప్రతిష్ట పాలు చేసింది రోజా.