English | Telugu

ఇది నా లెవల్ అంటున్న హీరోయిన్..షాక్ లో  సినిమా ఇండస్ట్రీ

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో చెప్పలేం. ఇప్పుడు రితికా సింగ్ ది అదే పరిస్థితి. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో రితికా ఒక ఐటెం సాంగ్ చేసింది. దాంతో చాలా మంది పాపం రితికా కి సినిమాలు లేవేమో అందుకే ఐటెం సాంగ్ చేసిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టి తనని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా చేసింది.
రజనీ కాంత్ 170 వ సినిమాలో నటించే ఛాన్స్ ని రితికా పొందింది. రజనీ కాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రితికా సింగ్ ని చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక మూవీలో అవకాశం రావటం నిజంగా రితికా కెరీర్ కి చాలా ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ తలైవా 170 మూవీలో రజనీ తో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి గొప్ప గొప్ప నటులు నటిస్తున్నారు.పైగా రజనీ సినిమా అంటే ప్యూర్ పాన్ ఇండియా సినిమా. కాబట్టి రితికా కి ఇది మంచి అవకాశమే అని చెప్పాలి.

నార్త్ కి చెందిన రితిక స్వతహాగా మంచి బాక్సర్. బాక్సర్ కథగా తమిళంలో తెరకెక్కిన ఇరుదుచుట్రూ అనే తమిళ సినిమా ద్వారా రితిక చిత్ర రంగ ప్రవేశం చేసింది. అదే సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా గురు పేరుతో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీలో రామేశ్వరి అనే క్యారక్టర్ లో రితికా వెంకటేష్ కి చుక్కలు చూపించి తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.