English | Telugu

ఈసారి బిగ్‌బాస్‌లో పెద్ద ట్విస్ట్‌.. భారీగా తగ్గిన రెమ్యునరేషన్‌!

రియాలిటీ షోలలో ఎక్కువ రీచ్‌ ఉన్న షోగా బిగ్‌బాస్‌ ప్రూవ్‌ చేసుకుంది. ఈ షోకి సంబంధించి ప్రతి సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తుంటారు. దేశంలోని వివిధ భాషల్లో బిగ్‌బాస్‌ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు విషయానికి వస్తే... 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్‌ను సెప్టెంబర్‌ 7 స్టార్ట్‌ చెయ్యబోతోంది. ఈ సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్ట్‌ 24 ఆదివారం హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 19 ప్రారంభమైంది. ఈ షోకి ఎప్పటిలాగే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో చేస్తున్నందుకు సల్మాన్‌ఖాన్‌ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీజన్‌ 19కి సంబంధించి సల్మాన్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ విషయం ఆసక్తికరంగా మారింది.

గత సీజన్స్‌లో హోస్ట్‌గా వ్యవహరించినందుకు 250 కోట్లు పారితోషికం తీసుకున్నారు సల్మాన్‌. మూడు సీజన్లుగా అతనికి ఇచ్చే ఎమౌంట్‌ను తగ్గించుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. 17వ సీజన్‌కు 200 కోట్లు చెల్లించగా, ఇప్పుడు 19వ సీజన్‌కు దాన్ని 150 కోట్లకు కుదించారు. దానికి కారణం సల్మాన్‌ చేసే ఎపిసోడ్స్‌ తగ్గడమే. ఈ సీజన్‌లో కేవలం 15 వారాలు మాత్రమే సల్మాన్‌ కనిపిస్తాడు. మిగతా వారాల్లో కరణ్‌ జోహర్‌, ఫరాఖాన్‌ వంటి ప్రముఖులు షోను నిర్వహిస్తారని తెలుస్తోంది. మొదట జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతుంది, తర్వాత కలర్స్‌ టీవీలో ప్రసారం కానుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్‌ 19 ప్రారంభమైంది. ఇంకా ఈ సీజన్‌లో కొన్ని కొత్త థీమ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సీజన్‌ బిగ్‌బాస్‌.. అభిమానుల్ని మరింత ఎంటర్‌టైన్‌ చెయ్యబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.