English | Telugu

'RC 17' డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్.. అనౌన్స్ మెంట్ ఆరోజే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ను శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇక తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాకి 'పెద్ది'(Peddi) అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెలలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే రామ్ చరణ్ 17వ సినిమా కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సుకుమార్ డైరెక్టర్ అని వినికిడి.

రామ్ చరణ్, సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో గతంలో 'రంగస్థలం' అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. 2018 మార్చిలో విడుదలైన ఈ మూవీ రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించడమే కాకుండా.. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. అందుకే వీరి కలయికలో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అని చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆయన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ 17వ సినిమాకి సుకుమారే దర్శకుడట.

చరణ్, సుక్కు కాంబోలో రెండో మూవీ రానుందని 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు రాజమౌళి(Rajamouli) కూడా తెలిపాడు. అంతేగాదు ఆ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ తనకు తెలుసని, అది ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు. అప్పటి నుంచి చరణ్-సుక్కు కాంబోలో రెండో చిత్రం కోసం ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు అభిమానుల కోరిక నెరవేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప-2'(Pushpa 2)ను రూపొందిస్తున్న సుకుమార్.. తన తదుపరి చిత్రాన్ని చరణ్ తోనే చేయనున్నాడట. ఈ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ప్రకటించే అవకాశముందని వినికిడి. అదే నిజమైతే చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.