English | Telugu

పాటలకు డాక్టర్‌ పట్టా అందుకోనున్న చంద్రబోస్‌!

శ్రీకాంత్‌ హీరోగా ముప్పలనేని శివ దర్శకత్వంలో డా.డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా..’ పాటతో రచయితగా ఇండస్ట్రీలో ప్రవేశించారు చంద్రబోస్‌. ఈ 30 సంవత్సరాల్లో 800 సినిమాల్లో 3,600కి పైగా పాటలు రాసారు చంద్రబోస్‌. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు జనంలోకి దూసుకెళ్లాయి. టాలీవుడ్‌లోని అందరు హీరోలకు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని రాసిన చంద్రబోస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును టాలీవుడ్‌కి అందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ అనే పాటకు ఒరిజినల్‌ మ్యూజిక్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించిందది.

సినిమా పాటలకు చంద్రబోస్‌ అందించిన సేవలను గుర్తించి హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంత సాగర్‌లోని ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. శుక్రవారం జరిగే విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో చంద్రబోస్‌కు డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయనున్నట్టు విశ్వవిద్యాలయం కాన్వకేషన్‌ కమిటీ చైర్మన్‌ సి.వి.గురురావు ప్రకటించారు. ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబోస్‌ తన ్ల కెరీర్‌ జర్నీలో 3600 పైగా పాటలు రాయడం ద్వారా పరిశ్రమలో చెరగని ముద్ర వేసారు. స్నాతకోత్సవంలో డిగ్రీ, డాక్టరేట్‌ ప్రదానంతో పాటు పూర్వ విద్యార్థులకు పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమం జరపబోతున్నాం’ అని తెలిపారు. ప్రథమ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్‌ అనీల్‌ డి.సహస్రబుధే.. (ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ షనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌.. ఎన్‌ఏఏసి , బెంగళూరు) ముఖ్య అతిథిగా పాల్గొననుండగా, ప్రొఫెసర్‌ దీపక్‌ గార్గ్‌ (ఎస్‌.ఆర్‌. యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌), ఏ వరదారెడ్డి, ఎస్‌.ఆర్‌. యూనివర్శిటీ ఛాన్సలర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .