English | Telugu

వెంకీ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో టాప్-5 సినిమాలు ఏవంటే చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. టాప్-5 లో ప్లేస్ కోసం చాలా సినిమాలు పోటీ పడతాయి. కానీ రవితేజ మాత్రం తన కెరీర్ లో టాప్-5 సినిమాలలో 'వెంకీ' ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.

రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రవితేజ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'వెంకీ' సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. వెంకీ తన ఫేవరెట్ మూవీ అని, ఇప్పటికీ ఆ సినిమాని ఎంతో ఎంజాయ్ చేస్తానని అభిమాని అన్నాడు. వెంటనే రవితేజ మాట్లాడుతూ "నీకే కాదు నాకు కూడా ఇష్టమైన సినిమా. నా టాప్-5 సినిమాలలో వెంకీ ఉంటుంది" అని చెప్పారు.

నిజంగానే వెంకీ అనేది రవితేజ కెరీర్ లో స్పెషల్ మూవీ. ఆయన టాప్-5 సినిమాలలో ఉండే అర్హత వెంకీ కి ఉంది. 2002 లో 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు,' 'ఇడియట్', 'ఖడ్గం', 2003 లో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వంటి సినిమాలతో ఆకట్టుకొని హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న రవితేజను యువతకు, మాస్ కి ఎంతగానో చేరువ చేసి ఒక్కసారిగా కెరీర్ కి బూస్ట్ ఇచ్చిన చిత్రం వెంకీ. 'నీకోసం' తర్వాత రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 2004 వేసవిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కష్ట పడకుండా జాతకాన్ని నమ్ముకుంటూ జీవితం మారిపోతుందని కలలు కనే మధ్యతరగతి యువకుడిగా రవితేజ తన నటనతో కట్టిపడేసారు. అప్పటిదాకా హీరో పాత్రలంటే ఇలాగే ఉండాలనే అభిప్రాయాన్ని వెంకీ పోగొట్టింది. అందులో హీరో పాత్ర.. లేని హీరోయిజం జోడించకుండా.. నేచురల్ గా, కామెడీగా.. నిజ జీవితంలో విలేజ్ లో ఉండే కొందరు కుర్రాళ్ళ జీవితానికి అద్దంపట్టేలా ఉంటుంది. అందుకే వెంకీ పాత్రకు ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కామెడీ అనేది హైలైట్. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టాడు. సినిమా వచ్చి 19 ఏళ్ళు దాటినా ఇప్పటికే అందులోని సన్నివేశాలను ప్రేక్షకులు పదే పదే చూసి ఎంజాయ్ చేస్తున్నారనే.. ఆ సన్నివేశాల్లో ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బలమైన కథాకథనాలు, హీరో పాత్ర, కామెడీ సన్నివేశాలు, బ్యూటిఫుల్ మ్యూజిక్.. అన్నీ తోడై ఈ సినిమాని రవితేజ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచేలా చేశాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.