English | Telugu

'రాక్షస రాజు'గా రానా దగ్గుబాటి!

రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. 2017 ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ తేజ ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాకి 'రాక్షస రాజు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు రివీల్ చేశాడు.

రానా సోదరుడు అభిరామ్ 'అహింస' అనే చిత్రంతో తెలుగుతెరకు హీరోగా పరిచయమవుతున్నాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రానా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రానా సమక్షంలోనే తన తదుపరి సినిమా వివరాలను వెల్లడించాడు తేజ. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత మరోసారి రానాతో చేతులు కలుపుతున్నట్లు తేజ చెప్పాడు. ఈ సినిమాకి 'రాక్షస రాజు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నామని, అయితే ఇంకా ఖరారు చేయలేదని తెలిపాడు. అంతేకాదు ఈ చిత్రం ద్వారా 40-50 మంది కొత్త నటీనటులను పరిచయం చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 'రాక్షస రాజు' టైటిల్ బాగుందని, దానినే ఖరారు చేయాలని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.