English | Telugu

రామానాయుడు గురించి కొన్ని ముఖ్యవిషయాలు

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రామానాయుడు స్టూడియోలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామానాయుడు గురించి కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం:

* రామానాయుడు తండ్రి ఓ రైతు.
* రామానాయుడు స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడు.
* సినిమా హీరో కావాలని కోరిక, ఎంతో మందిని హీరో చేసినా ఆయన కాలేకపోయాడు.
* ఆయన రాముడు-భీముడు సినిమాలో లాయరుగా తెరపై కనిపించాడు.
* గిన్నిస్ బుక్ ఎక్కిన ఏకైక నిర్మాత.
* బాపట్ల ఎంపీగా తొలిసారే రాజకీయాల్లో నెగ్గారు.
* సినిమాలకు ముందు ఓ రైస్ మిల్లు నడిపాడు.
* ఆయన సురేష్ ప్రొడక్షన్ స్థాపించి తీసిన తొలి సినిమా రాముడు-భీముడు సూపర్ హిట్.
* ఆయన ఆస్తులన్నీ అమ్మి తీసిన సినిమా ప్రేమనగర్. ఇది అరికెపూడి కౌసల్యాదేవి రాసిన నవల.
* ఆయన పరిచయం చేసిన దర్శకులు: శేషగిరి రావు, బాపయ్య, బోయిన సుబ్బారావు, నగేష్, కె.మురళీమనోహర్ రావు, బి.గోపాల్, వై.నాగేశ్వరరావు, కె.సదాశివరావు, జయంత్, ఏవీఎస్, తిరుపతిస్వామి, చంద్రమహేష్, ఉదయ్ శంకర్.
* రామానాయుడు బెంగాలీలో నిర్మించిన అసుఖ్ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.
* కేవలం 37 సంవత్సాల్లోనే ఆయన వంద సినిమాలు నిర్మించాడు.
* ప్రజా సేవ కోసం రామనాఆయుడు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు.
* ఆయన నెలకొల్సిన సంస్థలు: రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ఫిలిం ప్రొడక్షన్, రామానాయుడు అవుట్ డోర్ యూనిట్, రికార్డింగ్ థియేటర్స్, కలర్ ల్యాబ్, రామానాయుడు ఆడియోస్, డబ్బింగ్ థియేటర్స్, సురేష్ ఆఫ్ సెట్ ప్రింటర్స్, డిస్ట్రిబ్యూటర్, రాజేశ్వరి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్, రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్, సురేష్ ఓవర్సీస్ కమోడిటీస్ .
* నర్సాపూర్ సమీపంలో పదెకరాల్లో ఓ వృద్ధాశ్రమం,ఐదెకరాల్లో అనాథ శరణాలయాన్ని ఏర్పాటుచేసి ఆయనే పోషిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.