English | Telugu
రామానాయుడు అంత్యక్రియలు పూర్తి
Updated : Feb 19, 2015
తెలుగు సినిమా దిగ్గజం మూవీ మొఘల్ రామానాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి.రామానాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. రామానాయుడు పార్థివదేహానికి చివరిసారిగా నివాళులర్పించేందుకు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. రామానాయుడితో ఉన్న అనుంబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా సంఖ్యలో హాజరు కావడంతో రామానాయుడి స్టుడియో అంతా జనసంద్రంగా మారింది.