English | Telugu

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. మహేష్ ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్!

తాజాగా 'గుంటూరు కారం' సినిమా నుంచి విడుదలైన రెండో పాట 'ఓ మై బేబీ'పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తమ హీరోకి తమన్ మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు. సంగీతంతో పాటు 'ఓ మై బేబీ' పాట సాహిత్యం కూడా బాలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాట రాసిన ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించారు.

"సోషల్ మీడియా రోజురోజుకి దారుణంగా తయారవుతోంది. విషయంపై పూర్తి అవగాహన లేకుండానే కామెంట్, జడ్జ్ చేయొచ్చని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. దురుద్దేశాలతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను టార్గెట్ చేస్తున్నారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీతలు దాటుతున్నారు వీళ్ళు.

ప్రతివాడు మాట్లాడేవాడే. రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దానిని స్వాగతిస్తాము. కానీ పద్ధతి మీరకండి." అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.