English | Telugu
వర్మ మళ్ళీ రాంగ్ గోపాల వర్మే
Updated : Apr 13, 2011
వర్మ మళ్ళీ రాంగ్ గోపాల వర్మ అయ్యాడు. అందరిలా ఆలోచిస్తే రామ్ గోపాల్ వర్మ అవుతాడు. కానీ అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తాడు గనకే అప్పుడప్పుడూ ఇలా రాంగ్ గోపాల వర్మ అవుతూంటాడు. బహుశా ఐన్ స్టీన్ అవుదామనో ఏమో గానీ రామ్ గోపాల వర్మ చాలా విభిన్నంగా ఇంకా వివరంగా చెప్పాలంటే తిక్క తిక్కగా, తలతిక్కగా కూడా ఆలోచిస్తూంటాడు. ఇంతకీ విషయమేమిటంటే ఈ మధ్య రాంగ్ గోపాల వర్మకి స్వర్గం మీదికి గాలి మళ్ళింది. మన రాంగ్ గోపాల వర్మ ఆలోచన ప్రకారం మగాళ్ళంతా యజ్ఞ యాగాదులు వంటి క్రతువులు చేసి బోల్డంత పుణ్యం సంపాదించుకుని స్వర్గానికి వెళ్ళేది రంభ, ఊర్వశి, మేనక వంటి దేవ వేశ్యలతోటి సంభోగానికి, లేదా వారి నాట్యవినోదాది కార్యక్రమాలను చూసి ఆనందించటానికి.
మరి అలాగే బోల్డంత పుణ్యం చేసిన ఆడాళ్ళందరికీ అక్కడ అంటే స్వర్గంలోకి వెళితే అక్కడ వాళ్ళకెవరుంటారు....? మగాళ్ళకి స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వంటి దేవ వేశ్యలున్నట్లు, స్త్రీలకు స్వర్గంలో మగ వేశ్యలుంటారా...? అన్నది మన రాంగ్ గోపాల వర్మని దొలుస్తున్న ప్రశ్న. పండితోత్తములెవరన్నా రాంగ్ గోపాల వర్మ ఈ దిక్కుమాలిన ప్రశ్నకు సీటిగా ఘాటైన సమాధానం ఇవ్వరా...? ప్లీజ్....!