Read more!

English | Telugu

రామ్ చరణ్ బర్త్ డే కోసం గిన్నిస్ రికార్డ్ ప్రయత్నం

మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన కోసం రక్తాన్ని చిందించడానికి కూడా వాళ్లు సిద్ధంగా ఉంటారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత, చిరు సినీ వారసత్వాన్ని రామ్ చరణ్ కొనసాగించాడు. మెగాఫ్యాన్స్ అందరూ మెగాపవర్ ఫ్యాన్స్ గా మారి తమ అభిమానాన్ని రామ్ చరణ్ పై కురిపిస్తున్నారు. మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. అందుకే ఈ రోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నారు మెగాఫ్యాన్స్. గతంలో మెగాస్టార్ కోసం రక్తదానం చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు రక్తదాన శిబిరాలతో, మెగాపవర్ స్టార్ ను గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కించాలనుకుంటున్నారు. ఒకేసారి కొన్ని వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలనేది వీరి ఆలోచన. దాదాపు 250 బ్లడ్ క్యాంపుల్లో, క్యాంప్ కు వెయ్యి మంది చొప్పున బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అంటే ఒకే రోజులో కొన్ని లక్షల బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ అవుతాయి. గతంలో ఎప్పుడూ జరగకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా వరల్డ్ రికార్డే. ట్విట్టర్లో రామ్ చరణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు, అఖిల్ లాంటి స్టార్స్ అందరూ రామ్ చరణ్ కు విష్ చేశారు. రామ్ చరణ్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం.