Read more!

English | Telugu

హమ్మయ్య..ఐటెం సాంగ్ పెట్టేశారు..!

ఊపిరి ఒక ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెబుతున్నారు. సెలబ్రిటీలందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ది ఇంటచిబుల్స్ సినిమాకు ప్రాణం ఆ ఫీలే. అదే ఫీల్ ను, సోల్ ను వంశీపైడిపల్లి ఊపిరికి క్యారీ చేశాడని ప్రశంసలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ, ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో కూడా ఐటెం సాంగ్ ఎందుకు పెట్టినట్టో..? తెలుగు రొటీన్ ఫార్ములాకు దూరంగా వెళ్తున్నారన్న ఆనందాన్ని ఊపిరి 80 పెర్సంట్ మాత్రమే ఇచ్చింది అని చెప్పాలి. సినిమా మాంచి ఫీల్ లో క్యారీ అవుతున్నప్పుడు, ఒక్కసారిగా, ఆ మూడ్ ను ఐటెం సాంగ్ వచ్చి నేలమీదకు లాగేస్తుంది. రొటీన్ కమెడియన్స్ లేరులే అని ఆనందించే లోపే, మన తాగుబోతు రమేష్ గారిని కాసేపు మెరిపించి మాస్ సినిమాల్ని గుర్తు చేసేశాడు డైరెక్టర్ గారు. దీంతో 100 పర్సంట్ కొత్తదనాన్ని రీచ్ అవడంలో మిస్ అయిపోయాడు వంశీ. ఊపిరి లాంటి సినిమాలో కూడా ఐటెం సాంగ్ ను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు మాస్టారూ.. ఎందుకూ..అహ అసలెందుకూ అంట..!