Read more!

English | Telugu

నాగచైతన్య ఆ సినిమా చూసి ఏడ్చేశాడట..!

ఆ సినిమా చూసినంత సేపూ నాకు ఎమోషన్ కంట్రోల్ అవలేదు. అద్భుతమైన ఫీల్ ఉన్న సినిమా. చూస్తుంటే నాకు కన్నీళ్లాగలేదు అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇంతకీ ఏ సినిమా అనేగా మీ డౌటు. తన తండ్రి యాక్ట్ చేసిన ఊపిరి సినిమా గురించే చైతూ చెబుతున్నాడు. ఊపిరి సినిమా చాలా ఎక్స్ ట్రార్డినరీ గా ఉంది. ఒరిజినల్ సినిమా లో ఉన్న ఆత్మను మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మధ్య సినిమాల్లో మనం మర్చిపోతున్న ఎమోషన్ కు ఊపిరి మళ్లీ ఊపిరి పోసిందంటూ చైతన్య ఊపిరికి కితాబిచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా మది ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి నుంచి రాంగోపాల్ వర్మ వరకూ అందరూ ఊపిరి సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాల తర్వాత ఊపిరి హిట్ తో నాగార్జున హ్యాట్రిక్ కొట్టడం విశేషం.