English | Telugu

చర‌ణ్, బ‌న్నీ... స‌పోర్ట్ చేయ‌డం లేదా?

మెగా కాంపౌండ్‌ నుంచి ఈ యేడాది ఇద్ద‌రు హీరోలొచ్చారు. ఒక‌రు సాయిధ‌ర‌మ్‌తేజ్, మ‌రొక‌రు... వ‌రుణ్‌తేజ్. ఇద్ద‌రూ త‌మ తొలి ప్ర‌య‌త్నాల్లోనే ఆక‌ట్టుకొన్నారు. పిల్లా నువ్వు లేని జీవితం, ముకుంద సినిమాలు అభిమానుల వ‌ర‌కైతే న‌చ్చాయి. సో... ఇద్ద‌రూ పాసైపోయిన‌ట్టే. అయితే ఈ ఇద్ద‌రు హీరోల‌కూ మెగా కాంపౌండ్ నుంచి స‌పోర్ట్ ల‌భిస్తోంది లేదా? చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌, శిరీష్... వీళ్లంతా ఈ ఇద్ద‌రి వెనుక ఉన్నారా? లేదా? అనే పాయింట్లు ప్ర‌స్తుతం ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

ముందుగా సాయిధ‌ర‌మ్ తేజ్ విష‌యానికొద్దాం. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకి ప్ర‌మోష‌న్లు బాగానే జ‌రిగాయి. చిరంజీవితో స‌హా అంద‌రూ ముందుకొచ్చారు. ప‌వ‌న్ జాడ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే ప‌వ‌న్ స‌పోర్ట్ వెనుక నుంచి ఉంద‌ని, సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణే పెట్టుబ‌డి పెడుతున్నాడ‌నే టాక్ ప‌రిశ్ర‌మ‌లో బాగా వినిపిస్తోంది. త‌న సొంత సినిమా కాబ‌ట్టి అల్లు అర‌వింద్ `పిల్లా నువ్వు లేని జీవితం` ప‌నుల‌న్నీ ద‌గ్గ‌రుండి చూసుకొన్నాడు. బ‌న్నీ కూడా ముందుకు రావ‌డానికి కార‌ణం అదే. రేయ్ సినిమాకీ వీళ్లంతా ఇదే ర‌కంగా హెల్ప్ చేస్తార‌న్న‌ది అనుమాన‌మే.

ఇక వ‌రుణ్‌తేజ్ విష‌యానికి వ‌ద్దాం. ముకుంద తో ఎంట్రీ ఇచ్చాడు ఈ అర‌డుగుల హీరో. ఆసినిమాతో పాసైపోయాడు. న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ బాగానే ఉన్నాయి. కానీ వ‌రుణ్‌ని మెగా ఫ్యామిలీ నుంచే స‌పోర్ట్ లేదు. పెద‌నాన్న చిరంజీవి ఒక్క‌డే ముందుకొచ్చి ఈసినిమా గురించి మాట్లాడాడు. రామ్‌చ‌ర‌ణ్, బ‌న్నీలైతే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల విష‌యంలో దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆడియో వేడుకకు అటు చ‌ర‌ణ్, ఇటు బ‌న్నీ ఇద్ద‌రూ రాలేదు. ప‌వ‌న్ ఎలాగూ డుమ్మా కొట్టేశాడు. క‌నీసం విడుద‌లైన త‌ర‌వాత కూడా `మా ఇంటినుంచి మ‌రో హీరో వ‌చ్చాడు.. సినిమాని ఆద‌రించండి` అన్న ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు. బ‌న్నీ, చ‌ర‌ణ్ లేమైనా ఇన్పీయారిటీ కాంప్లెక్స్‌తో బాధ‌ప‌డుతున్నారా? అనే అనుమానాలు వేస్తున్నాయి. సాధార‌ణంగా ప‌వ‌న్ ఇలాంటి విష‌యాల‌కు దూరంగా ఉంటాడు. త‌న సినిమా చూడ‌మ‌నే చెప్ప‌డు. అలాంటిది మిగిలిన హీరోల సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొంటాడ‌నుకోవ‌డం అత్యాసే. అందుకే ప‌వ‌న్ ముందుకు రావ‌డం లేదు. కానీ చ‌ర‌ణ్‌, బ‌న్నీల మాటేంటి? వీళ్ల‌యినా స‌పోర్ట్ చేయొచ్చుగా. ముకుంద ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొండి ప్లీజ్‌... అని నాగ‌బాబు రిక్వ‌స్ట్ చేసినా బ‌న్నీ, చెర్రీ ఇద్ద‌రూ త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని టాక్‌. సొంత ఇంట్లోనే వ‌రుణ్‌తేజ్‌కి మ‌ద్ద‌తు లేకుండాపోయింది పాపం... నాగ‌బాబు ఒక్క‌డే ఈ సినిమాని మోసుకెళ్లాలి..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.