English | Telugu

బుల్లి మ‌గ‌ధీర‌ను క‌లిసిన రామ్‌చ‌ర‌ణ్‌

ఇటీవ‌ల యూ ట్యూబ్‌లో ఓ వీడియో హ‌ల్ చ‌ల్ చేసింది. మెగా అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. ఓ బుడ‌త‌డు... మ‌గ‌ధీర‌లోని రామ్‌చ‌ర‌ణ్ డైలాగ్‌ని గుక్క‌తిప్పుకోనివ్వ‌కుండా చెప్పేశాడు. ఆ వీడియోకి లైకులూ, షేర్లూ తెగ వ‌చ్చాయి. ఆ త‌ర‌వాత నుంచి ఆ బుడ్డోడు ఎవ‌డు?? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా `వాడ్ని క‌లుసుకోవాల‌ని వుంది` అంటూ మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. చివ‌రికి రామ్‌చ‌ర‌ణ్ ఆ బుల్లి మ‌గ‌ధీరుడ్ని క‌లుసుకొన్నాడు. బుడ్డోడి చేత మ‌ళ్లీ ఓసారి ఆ డైలాగ్ చెప్పించుకొని ఆనందించాడు. ఆ కుర్ర‌వాడి పేరు.. ప‌ర‌శురామ్‌. వాళ్ల‌ది నిరు పేద కుటుంబం. ఈ విష‌యాలు తెలుసుకొన్న చ‌ర‌ణ్... ప‌ర‌శురామ్ చ‌దువుల ఖ‌ర్చు మొత్తం నేనే భ‌రిస్తా అంటూ మాటిచ్చాడ‌ట‌. కొన్ని బ‌హుమానాలు ఇచ్చి.. ప‌ర‌శురామ్‌ని సంతోష పెట్టి మ‌రీ పంపాడ‌ట‌. త‌న అభిమాన హీరోని క‌లుసుకొన్న ఆనందం ఒక‌వైపు, ఇక నుంచి బ‌డికి వెళ్లొచ్చ‌న్న సంతోషం మ‌రోవైపు... వీటితో ప‌ర‌శురామ్ ఆనందంగా ఇంటికెళ్లిపోయాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.