English | Telugu

ప‌వ‌న్‌ని దేవుడ్ని చేసేశాడు

త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి మిత్రులు. ''నాకున్న ఆత్మీయ నేస్తం త్రివిక్ర‌మ్‌'' అంటూ ప‌వన్ కూడా ప‌లుసార్లు చెప్పాడు. అందుకే మెగా అభిమానులంతా 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' ఆడియోకి ప‌వ‌న్ అతిథిగా వ‌స్తాడనుకొన్నారు. కానీ రాలేదు. ఎందుకు రాలేద‌న్న అనుమానాల్ని త్రివిక్ర‌మ్ ఈ ఆడియో ఫంక్ష‌న్ సాక్షిగా నివృత్తి చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ ''ప‌వ‌న్‌తో ఇందాకే ఫోన్ లో మాట్లాడా. 'నేను రాలేద‌ని ఎవ‌రైనా అడిగితే ఏం చెబుతావ్‌' అని అడిగారాయ‌న‌. దీని కోసం వేరే డైలాగ్ రాసుకోవ‌డం ఎందుకు? నేను రాసిందే వాడేసుకొంటా. 'అమ్మ‌ని, దేవుడ్ని ర‌మ్మ‌ని పిల‌వ‌కూడ‌దు. చూడాల‌నుకొంటే మ‌న‌మే వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి..' అన్నాను'' అన్నారు త్రివిక్ర‌మ్‌. అంటే... త్రివిక్ర‌మ్ దృష్టిలోనూ ప‌వ‌న్ దేవుడ‌న్న‌మాట‌. పాత డైలాగే వాడినా.. భ‌లే చెప్పాడు క‌దూ. మొత్తానికి ఈ ఒక్క‌మాట‌తోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని మ‌ళ్లీ ప‌డేశాడు త్రివిక్ర‌మ్‌.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.