English | Telugu

మెగాస్టార్ కి స్టైల్ లేదా?

సన్నాఫ్‌ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో జరిగిన కొన్ని అనవసర పరిణామాలతో మెగా ఫ్యామిలీలో సంబంధ బాంధవ్యాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాయన దాసరి నారాయణరావు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కోసమే ఈ వేడుకకు వచ్చానని మొదలుపెట్టి.. స్టయిల్‌ విషయంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ల తర్వాత పవనే అంటూ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. డ్యాన్సుల్లో, ఫైట్లలో చిరంజీవి తీసుకొచ్చిన స్టయిల్‌ గురించి అందరికీ తెలుసు. అలాంటిది చిరును వదిలేసి పవన్‌ను ఆకాశానికెత్తేయడం అభిమానుల్ని అయోమయంలోకి నెట్టింది. తన ప్రసంగమంతా చిరు ప్రస్తావనే రాకుండా చూసుకున్న దాసరి.. బన్నీని మాత్రం తెగ పొగిడారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.