English | Telugu
ఏప్రిల్ లో చెర్రీ బోయపాటి సినిమా
Updated : Feb 24, 2014
కృష్ణవంశీ మల్టీస్టారర్ సినిమాలో బిజీగా ఉన్న చరణ్ తన తరువాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో పవర్ ఫుల్ స్టూడెంట్ గా చెర్రీ నటించబోతున్నట్లుగా తెలిసింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్. నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ రామేశ్వరంలో జరుగుతుంది. ఇందులో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్.