English | Telugu

నాన్నే మా హీరో అంటున్న సూపర్ స్టార్లు

ఈ రోజు ఫాదర్స్ డే.. బిడ్డకోసం అమ్మ చేసే త్యాగం ఎంత ముఖ్యమైనదో... నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతకన్నా ముఖ్యమైనవి. బయటప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి తన ఊపిరి ఆగిపోయే వరకూ కొండంత అండగా నిలబడే ఒకే ఒక వ్యక్తి నాన్న. వేలుపట్టుకుని అడుగులు నేర్పించే నాన్న భవిష్యత్ వైపు ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తాడు. అలా తల్లిదండ్రుల పాలనతో విజయం సాధించిన నటులు, తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారిలా...

రామ్ చరణ్

నాన్నతో గడిపిన చిన్ననాటి రోజులంటే నాకెంతో ఇష్టం. ఈమధ్య నాన్నేమో రాజకీయాల్లో నేనేమో సినిమాల్లో బిజీగా ఉండటంతో అప్పటిలా ఎక్కువ సమయం కలిసి గడపలేకపోతున్నాం. అయితే ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌లో మాత్రం టచ్‌లోనే ఉంటాను. నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు 'నేను సలహాలు మాత్రమే ఇవ్వగలను. నటుడుగా నిన్ను నువ్వే నిరూపించుకోవాలి' అన్నారు. ఇప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టుకునే ముందుకు వెళుతున్నా. నా ప్రతి సినిమా విషయంలోనూ నాన్న సలహా తప్పక తీసుకుంటాను. ఎందుకంటే నటనలో ఆయన అనుభవాలే నాకు పాఠాలు అన్నారు.



మహేష్

మా నాన్నగారితో మాట్లాడుతుంటే సమయమే తెలీదు. జోక్స్‌ బాగా వేస్తారు. నా సినిమాలకు మొదటి, ఉత్తమ విమర్శకులు ఆయనే. అలాగే సూపర్‌స్టార్‌ కృష్ణగారబ్బాయి... జన్మనే కాదు, పుడుతూనే గుర్తింపునీ ఇచ్చారు. ఇంతకన్నా ఏ తండ్రయినా ఏమివ్వగలడు? వేసవి సెలవులు ఇచ్చిన ప్రతీసారి నన్ను వూటీ తీసుకెళ్లేవారు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం ఎంత ముఖ్యమో దానివల్ల వాళ్ల జీవితం దారి తప్పకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. బాలనటుడుగా దూసుకుపోతున్న నాకు మధ్యలో 'ఇక సినిమాలు వద్దు, బుద్ధిగా చదువుకో' అంటూ బ్రేక్‌ వేశారు. నేను ఎదురుచెప్పలేదు. డిగ్రీ చేసేటప్పుడు మళ్లీ సినిమాల ఆలోచన వచ్చింది. ఆ విషయం అప్పుడు నాన్నగారికి చెప్పాను. వెంటనే సరేనన్నారు. అలా నా విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు.

శర్వానంద్

నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా నాన్నలో బాగా నచ్చింది ఆయన సేవాగుణం. పుట్టి పెరిగిన అవనిగడ్డలో పాతికేళ్ల క్రితం స్కూలు కట్టించారు. ఆ స్కూలు ద్వారా ఏటా ఐదొందల మంది అమ్మాయిలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. నేను కూడా ఆయనలానే సేవ చేయాలనుకుంటున్నా. ఐ లవ్‌ యూ డాడ్‌. మానాన్న ప్రసాదే నా హీరో. ఎప్పటికీ ఆయన కొడుకుగానే పుట్టాలని దేవుణ్ని కోరుకుంటాను.


ప్రభాస్

నిజానికి మా నాన్న ఎవరితోనయినా చాలా తక్కువ మాట్లాడేవారు. కానీ అందులోనే చాలా విషయం ఉండేది. ఆయన ప్రభావం నామీద చాలా ఎక్కువ. నా బాడీ లాంగ్వేజ్‌, మాటతీరు నాన్నలానే ఉంటాయని అంతా అంటుంటారు. అలా అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాన్నంటే చాలా ఇష్టం. కానీ ఆయనతో చాలా తక్కువ మాట్లాడేవాణ్ని. ఓ ఫాదర్స్‌డే రోజున నేను ఆయన పక్కన కూర్చుని చదువుకుంటున్నాను. ఆయన నన్ను పిలిచి ఫాదర్స్‌ డే గురించి చెప్పమన్నారు. 'అతి తక్కువ మాటలతో నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తి మా నాన్న' అని ఠక్కున అనేశాను. అదేదో ఆలోచించి చెప్పింది కాదు. అలా ఎలా చెప్పానో నాకే తెలీదు. బహుశా నాన్న గురించి నా మనసులోని మాట అలా వచ్చేసి ఉంటుంది. ఆయన మాత్రం వెంటనే నన్ను కౌగిలించుకుని కంటనీరు పెట్టేశారు. ఫాదర్స్‌ డే అనగానే నాకు గుర్తొచ్చే సంఘటన ఇదే.



తమన్నా

మా నాన్న సంతోష్‌ భాటియా. నాకేమో చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. నాన్నతో చాలా క్లోజ్‌గా ఉన్నా 'సినిమాల్లోకి వెళతా నాన్నా' అని చెప్పడానికి మాత్రం చాలా భయపడ్డా. నా అవసరాలన్నీ ముందే గమనించి అన్నీ అడక్కుండానే ఇచ్చారు. అలాంటిది సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదంటే ఇద్దరం నొచ్చుకోవాల్సి వస్తుందని చెప్పలేకపోయా. ఒక రోజు ధైర్యం చేసి చెప్పేశా. 'నీ మీద నీకు నమ్మకం ఉంటే తప్పకుండా వెళ్లు. కానీ ఎప్పుడూ మంచిదారిలోనే నడవాలి' అన్నారు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.