Read more!

English | Telugu

రామ్ చరణ్ రెమ్యునరేషన్ వద్దంటున్నాడు..!

రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో రెమ్యునరేషన్ వద్దంటున్నాడా..? ఎందుకబ్బా..ఫ్రీ గా సినిమా చేస్తున్నాడా..ఈ క్వశ్చన్స్ మీ మైండ్ లోకి వచ్చే ఉంటాయి. అలాంటిదేమీ కాదు గానీ, రెమ్యునరేషన్ బదులు వేరే విధంగా తనకు రావాల్సినదాన్ని తీసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. ఈ మధ్య సినిమాలు ఫ్లాప్ అయితే, రెమ్యునరేషన్ తిరిగివ్వాలని డిస్ట్రిబ్యూటర్లు హీరోలను డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే గతంలో తన తండ్రి ఫాలో అయిన పద్ధతినే ఫాలో అయిపోతున్నాడు. మెగాస్టార్ పీక్స్ లో ఉన్నప్పుడే, రెమ్యునరేషన్ బదులు, నైజాం ఏరియా రైట్స్ తీసేసుకునేవారు. సాధారణంగా మెగా ఫ్యామిలీకి బాక్సాఫీస్ ఆదాయవనరుగా ఈ ఏరియాకు పేరు. దీంతో చరణ్ కూడా తండ్రి బాటనే ఫాలో అయిపోతున్నాడట. త్వరలో రాబోతున్న తనీ ఒరువన్ రీమేక్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం రైట్స్ నే తీసుకున్నాడట చెర్రీ. రెమ్యునరేషన్ మహా అయితే 8 కోట్లు ఉంటుంది. కానీ ఇలా రైట్స్ తీసుకుంటే సినిమా ఫట్టయినా మినిమం వచ్చేస్తుంది. పైపెచ్చు డిస్ట్రిబ్యూటర్లు పెట్టే ఇబ్బంది రాదు. ఇక సినిమా హిట్టయితే, కలెక్షన్లకు తిరుగేముంది. అదండీ..చెర్రీ రెమ్యునరేషన్ తీసుకోకపోవడం వెనుకనున్న కథ..ఫ్యూచర్లో హీరోలందరూ ఇదే పద్ధతిని ఫాలో అయితే ఆశ్చర్యం లేదేమో..!