Read more!

English | Telugu

పనామా పేపర్స్ కాంట్రవర్సీలో అజయ్ దేవగణ్, కాజోల్...!

పనామా పేపర్స్ సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనబడట్లేదు. తాజాగా అజయ్ దేవగణ్, కాజోల్ జంట పనామా పేపర్ల బాధితులయ్యారు. దేవగణ్ దంపతులకు విదేశీ ఖాతాల్లో ఆస్తులు ఉండటంతో పాటు, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ కు చెందిన మెరైల్ బోన్ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ లో అజయ్ దేవగణ్ వెయ్యి షేర్లను కొన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. నైసా యుగ్ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ పేరుతో అజయ్ విదేశీ షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్ 31, 2013 వరకూ ఆ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరించారు. డిశంబర్ 15, 2014 న ఆ పదవికి రిజైన్ చేశారు. అజయ్ పెట్టుబడులన్నీ అక్రమమైనవే అని పనామా పత్రాలు చెబుతున్నాయి. దీనిపై అజయ్ దేవగణ్ తాము సవ్యంగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టామని, వీటికి సంబంధించి ప్రతీ ట్యాక్స్ ను చెల్లించి చట్టబద్ధంగా లావాదేవీలు జరిపామని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరుగా, సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తుండటంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఇప్పుడు గుండెల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ పేర్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే..