Read more!

English | Telugu

ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాపీ బర్త్ డే త్రిష..!

ఈరోజుతో త్రిష 32 వ ఏట అడుగుపెడుతోంది. 1983, మే 4న చెన్నై లో పుట్టిందీ అమ్మడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న త్రిష ఫ్యాన్స్, ఆమెకు హ్యాపీ బర్త్ డే అంటూ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ట్విట్టర్లో హ్యాపీ బర్త్ డే త్రిష అన్న ట్యాగ్ ఉదయం నుంచీ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపి, తన పుట్టిన రోజు ఫోటోలను పోస్ట్ చేసిందీ చెన్నై చిన్నది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం త్రిష నటించిన హర్రర్ కామెడీ నాయకి విడుదల కావాల్సి ఉంది. సినిమాలో భయం అనే పాటను త్రిష పాడిన సంగతి తెలిసిందే. గతంలో కమల్ హాసన్ మన్మథబాణం సినిమాలో చిన్న బిట్ పాడిన త్రిష, నాయకిలో మాత్రం పూర్తి స్థాయి సింగర్ గా పాట పాడేసింది. నాయకి మీదే త్రిష ఆశలన్నీ ఉన్నాయి. తన కెరీర్ ను ఈ సినిమా మళ్లీ పరుగులు పెట్టిస్తుందని ఆశిస్తోంది త్రిష. వచ్చే బర్త్ డే టైం కు తన ఖాతాలో మరిన్ని సినిమాలు ఉండాలని కోరుకుంటోంది. నాయకి ఆమెను నాయకిగా మారుస్తుందో లేదో చూడాలి..