English | Telugu

నాగచైతన్య సరసన రాకుల్ ప్రీత్

నాగచైతన్య సరసన రాకుల్ ప్రీత్ హీరోయిన్ గానటించబోతోందట. వివరాల్లోకి వెళితే యువ హీరో నాగచైతన్య సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించబోతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రాకుల్ ప్రీత్ ఎవరంటే రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుండి వచ్చిన సిద్ధార్థ్ రాజ్ కుమార్ తొలిసారి హీరోగా నటిస్తున్న త్రిభాషా చిత్రం "కెరటం"లో ఈ రాకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. రాకుల్ ప్రీత్ గతంలో మిస్ ఇండియా కాంపిటీషన్లో ఫైనలిస్ట్ గా నిలిచింది ఈ రాకుల్ ప్రీత్.

అంతే కాదు పెంటలూన్ ప-హెమీనా మిస్ ఇండియా 2011 కాంపిటీషన్లో కూడా రాకుల్ ప్రీత్ ఫైనలిస్ట్ గా నిలిచింది. అటువంటి రాకుల్ ప్రీత్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా ఎన్నికైందని తెలిసింది. అయితే రాకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించబోయేది నాగచైతన్య హీరోగా నటిస్తున్న "ఆటోనగర్ సూర్య" సినిమాలోనా...? లేక "బెజవాడ రౌడీలు" సినిమాలోనా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.