English | Telugu

సూపర్‌స్టార్‌ రజనీ 170 సినిమా టైటిల్‌ ‘వెట్టయాన్‌’!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 73వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడాలు లేకుండా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు తలైవర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తలైవా 170 సినిమాకి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. టిజె జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న రజినీ 170 సినిమా టైటిల్‌ ‘వెట్టయాన్‌’. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ సూపర్‌స్టార్‌ రేంజ్‌కి తగ్గట్టుగానే ఎంతో స్టైలిష్‌గా ఉంది. 73 ఏళ్ళ వయసులో అదే ఎనర్జీతో స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఇస్తూ అభిమానులను మెస్మరైజ్‌ చేస్తున్నారు రజనీ. అనిరుధ్‌ రవిచందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎంతో స్టైలిష్‌గా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా కూడా రజనీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్న నమ్మకం ఉందని అభిమానులు సంతోషంగా చెబుతున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.