English | Telugu

రజనీ కాంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్

రజనీ కాంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారట. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజని కాంత్ నిన్న ఎ.వి.యమ్. స్టుడియోలో తాను హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రం ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుండి అస్వస్థులు కావటంతో ఆయన్ని చెన్నై మైలాపూర్ లోని ఒక ప్రవైట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ రజనీ కాంత్ కి అవసరమైన పరిక్షలన్నీ చేసి, ఆయన కొన్ని రోజులు మాత్రం విశ్రాంతి తీసుకుంటే చాలనీ, ఆయన ఆరోగ్యానికేం ఢోకా లేదనీ డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆయన్ని హాస్పిటల్ నుండి సిశ్చార్జ్ చేశారు.

రజనీ నటించబోయే "రాణా" చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తూండగా, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీని, ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రజనీ కాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ "రాణా" చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ భామలు దీపిక పదుకునే, విద్యాబాలన్ లతో పాటు గోవా బ్యూటీ ఇలియానా కూడా నటిస్తూంది. ఈ "రాణా" చిత్రం కోసం ఎ.వి.యమ్.స్టుడియోలో మూడు కోట్ల రూపాయల భారీ ఖర్చుతో ఒక భారి సెట్ ను నిర్మించారు. రజనీ కాంత్ తిరిగి కోలుకోగానే "రాణా" చిత్రం షుటింగులో పాల్గొంటారు. "రాణా" చిత్రం వచ్చే సంవత్సరం అంటే 2012 లో విడుదలవుతుంది.