English | Telugu

రామ్ చరణ్ కి కథ చెప్పిన ప్రభుదేవా

రామ్ చరణ్ కి కథ చెప్పిన ప్రభుదేవా అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే సుమంత్ ఆర్ట్స్ పతాకంపై, సిద్ధార్థ హీరోగా, త్రిష హీరోయిన్ గా, రియల్ స్టార్ శ్రీహరి, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించగా, యమ్.యస్.రాజు నిర్మించిన "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ప్రభుదేవా, ఆ తర్వాత అదే బ్యానర్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిష, ఛార్మి హీరోయిన్లుగా "పౌర్ణమి" అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఘనవిజయం సాధించలేదు.

అలాగే మెగాస్టార్ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నయనతారతో ప్రేమాయణం సాగించి జులైలో ఆమెను వివాహం చేసుకోబోతున్న ప్రభుదేవా ఈ మధ్య యువ హీరో రామ్ చరణ్ కి ఒక కథ చెప్పాడట. కానీ దానికి రామ్ చరణ్ తన అంగీకారాన్ని ఇంకా తెలియజేయలేదని సమాచారం. రామ్ చరణ్ మెగాసూపర్ గుడ్ ఫిలింస్ లో సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" అనే సినిమాలో నటించబోతున్నాడు. తమన్నా భాటియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.