English | Telugu
మహేష్ బాబు, మణిరత్నం సినిమా ఆగిందట
Updated : Apr 30, 2011
మహేష్ బాబు, మణిరత్నం సినిమా ఆగిందట. వివరాల్లోకి వెళితే తమిళ నవల "పొన్నియన్ సెల్వన్" ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిందని కోలీవుడ్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమాకి 100 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చవుతుంది. ఈ సినిమాకయ్యే భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టేందుకు ఏ ఫైనాన్సియరూ, ఏ కార్పొరేట్ కంపెనీ ముందుకు రావట్లేదనీ, అందుకనే మణిరత్నం ఈ సినిమాని ఆపేయాల్సి వచ్చిందనీ వినికిడి.
మణిరత్నం ఈ సినిమాకంటే ముందు తెలుగులో "విలన్" అనీ, తమిళ, హిందీ భాషల్లో "రావణ్" అనీ నిర్మించిన చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ప్రభావం ఈ సినిమా మీద పడిందని తమిళ పత్రికలంటున్నాయి. ఒక వేళ ఈ చిత్రం మొదలైతే ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్ లలో మహేష్ బాబు, తమిళ వెర్షన్ లో విజయ్ నటించేవారు. ఈ సినిమా మణిరత్నం తీసినట్లయితే ఒక భారీ చారిత్రాత్మక చిత్రంగా చరిత్రలో నిలిచిపోయేదట.